TDP Agitations Continues Against Chandrababu Arrest :అనంతపురంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. గుమ్మడికాయలపై జగన్ వైరస్ అని రాసి వాటిని పగలగొట్టారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేశారు. చంద్రబాబు త్వరగా జేలు నుంచి విడుదల కావాలని కోరుతూ కర్నూలు జిల్లా గోనెగండ్లలోని చింతలముని నల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మిగనూరు కూడలలిలో రిలే నిరాహార దీక్ష చేశారు. ఆదోని కళ్ళు గీత కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్ళు తీసే కుండల పై 'బాబు కోసం మేము సైతం' అని రాసి... సైకో పోవాలి.... సైకిల్ రావాలని గోవింద నామాలతో నినాదాలు చేశారు.
Old Women Crying on Chandrababu Arrest: 'చంద్రబాబు తప్పు చేయడు.. ఆయన బయటకు రావాలి..' కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు
TDP Cadre Protest in APAgainst CBN Arrest : నెల్లూరు శ్రీ వెంగమాంబ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన నారసింహ హోమం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో టీడీపీ మహిళా నేత వేగుంట రాణి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేస్తున్న దీక్షకు మద్దతుగా... మంగళగిరి మండలం వడ్లపూడికి చెందిన సుమారు 150 కుటుంబాలు దీక్షలో పాల్గొన్నాయి.
TNSF Leaders Hunger Strike Against Chandrababu Arrest :బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల నుంచి రాచపూడి వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేశారు. విజయవాడలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు పొట్లూరి దర్షిత్, రేపాకుల శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.