పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో తెదేపా నేతలు దీక్షలు చేపట్టారు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్తో పాటు పార్టీ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ ... ఇప్పుడు మాట తప్పారని కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. కరోనా కష్టకాలంలో బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. మూడు నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని డేగల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా పాత శ్లాబుల ప్రకారమే బిల్లులు వసూలు చేయాలన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'కష్టకాలంలో ప్రజలపై భారం మోపారు' - విద్యుత్ బిల్లుల పెంపుపై తెదేపా నిరసనలు
పాత శ్లాబుల ప్రకారమే బిల్లులు వసూలు చేయాలని గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా చేపట్టిన నిరసనలో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో నేతలు దీక్షలు చేపట్టారు.
విద్యుత్ బిల్లుల పెంపుపై తెదేపా నిరసనలు