విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో తెదేపా నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హిమని సెంటర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
స్వార్ధ ప్రయోజనాల కోసమే..
స్వార్ధ ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని యత్నిస్తున్నాయని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహమ్మద్ అన్నారు. ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటామని చెప్పారు. భాజపా, వైకాపా చీకటి ఒప్పందాలకు చరమ గీతం పాడాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెదేపా కట్టుబడి ఉందని.. విశాఖ ఉక్కును సాధించుకునే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
రేషన్ బియ్యం పంపిణీ 25 శాతమే..!