ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం: కనకమేడల

గుంటూరులో జరిగిన తెదేపా న్యాయవిభాగ ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమకేసులపై పోరాడేందుకు న్యాయవిభాగం ఏర్పాటుచేశామని కనకమేడల చెప్పారు.

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం : కనకమేడల

By

Published : Sep 10, 2019, 7:06 PM IST

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం : కనకమేడల

తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్...గుంటూరులో నిర్వహించిన తెదేపా న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కనకమేడల మాట్లాడుతూ...రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. సీనియర్ మంత్రులకూ గెజిట్‌కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు న్యాయ విభాగం ఏర్పడిందని స్పష్టం చేశారు. పార్టీకి, న్యాయ విభాగానికి ఓ వారధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కో - ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తామని కనకమేడల అన్నారు. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details