TDP activists protests against Chandrababu arrest: రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్.. ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేయడంపైనే దృష్టి సారిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే.. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. చంద్రబాబును విడుదల చేసే వరకూ విశ్రమించబోమని తేల్చి చెప్పారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. కృష్ణా జిల్లా రైతుపేటలో తెలుగుదేశం చేపట్టిన నిరాహార దీక్షకు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సగర సామాజిక వర్గం నేతలు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో... దొనకొండ, కురిచేడు మండలాలకు చెందిన తెదేపా, జనసేన మహిళలు నిరాహార దీక్షలు చేశారు.
Crucial Monday in Chandrababu Cases: చంద్రబాబుకు కీలక సోమవారం.. టీడీపీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ
చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కమ్మ సామాజిక వర్గం నిర్వహించిన ర్యాలీకి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మద్దతు తెలిపారు. రా లో జగన్ రావణ రాజ్యం సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒంటి కాలిపై నిలబడి పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. హిందూపురంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు...... నిరాహార దీక్షలు చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉరవకొండలో బెస్త సంఘం నాయకులు దీక్షా శిబిరానికి... వల, చేపలను వేలాడదీసి వినూత్నంగా నిరసన తెలిపారు. నార్పల మండలంలో మట్టి కుండలపై సైకో పోవాలి- సైకిల్ రావాలి అని రాసి కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం నేతలు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం తరహాలో నమూనాను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
TDP Leaders Protests on CBN Arrest Across AP: అధినేత అరెస్టుపై ఊరూరా.. ఉద్యమ హోరు.. ఎగసి పడుతున్న నిరసన జ్వాలలు..
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.... అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో భవిష్యత్ నిర్మాత చంద్రబాబు అని, బాబుతోనే మేము అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ముమ్మిడివరం సీహెచ్ గున్నేపల్లి గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయంలో 108 టెంకాయలు కొట్టి పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా చేపట్టిన దీక్షకు ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ... మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... అనపర్తి మండలం రామవరం నుంచి పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా అనకాపల్లి జిల్లా బంగారు మెట్ట గ్రామంలో రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు.
TDP Leaders Responded to TDP Party Funds: చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకునేందుకే.. వైసీపీ ప్రభుత్వ కొత్త ఎత్తులు..