సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు కావటంపై తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం చింతలపూడిలో తెదేపా కార్యకర్తలు బాణసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. డెయిరీ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ అధికారులు నెల రోజుల క్రితం నరేంద్రను అరెస్ట్ చేశారు.
దూళిపాళ్లకు బెయిల్.. తెదేపా కార్యకర్తల సంబరాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు కావటంపై తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం చింతలపూడిలో తెదేపా కార్యకర్తలు బాణసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దూళిపాళ్లకు బెయిల్ రావటంపై తెదేపా కార్యకర్తల సంబరాలు
ప్రస్తుతం ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. అయితే విజయవాడలోనే ఉండాలని షరతు విధించింది.