వినుకొండ సీఐ తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవం చేయకుంటే అక్రమ కేసులు పెడతానని బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ తహసీల్దార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
వినుకొండ సీఐ తీరుకు నిరనసగా తెదేపా కార్యకర్తల ఆందోళన - tdp leaders comments on vinukonda ci
గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
tdp activist protest against vinukonda CI