గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం, ఇంటిపై ఐటీ దాడులను తెదేపా నేత టీడీ జనార్దన్ ఖండించారు. ఎన్నికల సంఘం అధికారుల చర్యలను తప్పుబట్టారు. ఏడాది నుంచి జయదేవ్‌ను అనేక రకాలుగా వేధిస్తున్నారన్నారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ మొదలుకానున్న పరిస్థితుల్లో... ఇలాంటి దాడులతో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీని ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్పీపై చర్యలు తీసుకోవడం దారుణమని.. ఈ చర్యలు ఎన్నికల సంఘం నిబద్ధతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఈసీని కోరారు.
'ఎన్నికల వేళ దాడులు.. ఈసీ నిబద్ధతపై అనుమానం' - ఖండన
మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. తెదేపా నేతలపై దాడులు ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని తెదేపా నేత టీడీ జనార్దన్ అన్నారు. జయదేవ్ ఇంటిపై దాడులను ఆయన ఖండించారు.
టీడీ జనార్ధన్