గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని జంగంగుంట్లపాలెంలో.. నివర్ తుపాను వల్ల పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పంటలను పరిశీలించారు. పంటలన్నీ నీట మునిగిపోయాయని ఈ సందర్భంగా పలువురు రైతులు ఎమ్మెల్యే వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీదేవి - MLA Sridevi inspected damaged crops in guntur
తపాను ధాటికి గుంటూరులోని జంగంగుంట్లపాలెంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. వర్షాల వల్ల అధికంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీదేవి