గుంటూరు జిల్లా తెనాలిలో టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పెట్రోల్ కొలతల్లో, నాణ్యతలో లోపం వస్తుందని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీ చేసినట్లు మండల తహసీల్దార్ కె. రవిబాబు తెలిపారు. కొలతలు, నాణ్యతలో తేడాలు వస్తే పెట్రోల్ బంకులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
తెనాలిలో టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీలు - crime updates in guntur district
గుంటూరు జిల్లా తెనాలిలోని పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లల్లో టాస్క్ఫోర్స్ బృందాల అధికారులు తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ కొలతలు, నాణ్యతలో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.

తెనాలిలో టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీలు