ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా వ్యాక్సినేషన్​లో ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలి'

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలని గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. ప్రభుత్వం అందించిన మాడ్యూల్ ప్రకారం పక్కాగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.

'కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలి'
'కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలి'

By

Published : Dec 21, 2020, 10:54 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహించనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రణాళికాయుతంగా బాధ్యతలు నిర్వర్తించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన వాక్సినేషన్ ఇంటర్ సెక్టోరల్ కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన మాడ్యూల్ ప్రకారం పక్కాగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో అధికారులు, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మొదటి దశలో వ్యాక్సిన్ వేసేందుకు జిల్లావ్యాప్తంగా 190 ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 15 వేల 426 మంది, 1,623 ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 15 వేల 23 మంది వైద్య సిబ్బందిని, 23 ఐసీడీఎస్ యూనిట్లలోని అంగన్​వాడీ సిబ్బంది వివరాలను కో-విన్ యాప్​లో నమోదు చేయాలన్నారు. మొదటి దశలో గుర్తించిన 185 కేంద్రాల్లో వెయిటింగ్ రూమ్​, వాక్సినేషన్ రూమ్, ఆబ్జర్వేషన్ రూమ్​లను కొవిడ్ నిబంధనల ప్రకారం సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ తరహాలో ప్రతి కేంద్రానికి ఐదుగురు సిబ్బందితోపాటు అదనంగా 10 మంది రిజర్వు సిబ్బందిని విధులకు కేటాయించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details