Tanikella Bharani is a spiritual treat for the couple: గుంటూరు జిల్లా తెనాలిలో.. రాళ్లపల్లి సుందరం కళావేదిక ఆధ్వర్యంలో.. తనికెళ్ల భరణికి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ వేడుకల నిర్వాహకులు.. తనికెళ్ల భరణి దంపతులకు సత్కారం చేసి.. చేతికి బంగారు కంకణం తొడిగారు. తెనాలితో తనకున్న అనుబంధాన్ని తనికెళ్ల భరణి గుర్తు చేసుకున్నారు. తెనాలి రామలింగడు నడిచిన నేలలో ఇసుక రేణువులన్నీ.. శివలింగాలుగా మారాయని గుర్తు చేశారు. మానవ సంబంధాలు తెగిపోతున్న తరుణంలో.. మనుషులు మంచిగా నడుచుకుంటేనే.. భవిష్యత్ తరాలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు తెలుగులో పేరు రాయలేకపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు తరం ఏమైపోతుందోనని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఆలపాటి రాజా పాల్గొన్నారు.
తెనాలిలో తనికెళ్ల భరణి దంపతులకు ఆత్మీయ సత్కారం - NTR centenary celebrations
Tanikella Bharani is a spiritual treat for the couple: పిల్లలు తెలుగులో పేరు రాయలేకపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు తరం ఏమైపోతుందోనని ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రాళ్లపల్లి సుందరం కళావేదిక ఆధ్వర్యంలో.. ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.
తనికెళ్ల భరణి దంపతులకి ఆత్మీయ సత్కారం