MLA Rohit Reddy met CM KCR: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలిశారు. ఈడీ విచారణ కేసులో ఇంతకు ముందు కూడా రోహిత్.. కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇటీవల మనీ లాండరింగ్ విషయంలో ఈడీ... రోహిత్‌ను విచారణకు హాజరు కావాల్సిందని ఆదేశించింది. ఈ సమయంలోనే కేసీఆర్‌తో రోహిత్‌రెడ్డి భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
అయ్యప్ప మాల విరమించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో భేటీ! - Rohit Reddy discussion with CM KCR
MLA Rohit Reddy met CM KCR: సమీప బంధువు మృతితో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అయ్యప్ప దీక్ష విరమించారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈడీ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌తో మరోసారి రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు.
అయ్యప్ప మాల విరమించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. కేసీఆర్‌తో భేటీ!
అయితే మంగళవారం రోహిత్‌రెడ్డి ఈడీ 7 గంటలుగా సుదీర్ఘంగా విచారించింది.... ఎమ్మెల్యే వ్యక్తిగత, వ్యాపార వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ తనను ఈడీ అధికారులు ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యేల ఎర కేసు వివరాలు సైతం అడిగినట్లు పేర్కొన్నారు. ఇక ఈరోజు రోహిత్‌రెడ్డి సమీప బంధువు మృతి చెందడంతో... అయ్యప్ప మాల విరమించినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి..
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు