ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహజ వనరుల కోసం.. కన్యాకమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర - bike yatra

సహజ వనరులు సమృద్ధిగా లభించాలని... ప్రజలకు తాగునీరు, దేశానికి అన్నం పెడుతున్న రైతన్న సాగుకు సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి  మోటారు సైకిల్ యాత్రను చేపట్టారు.

కన్యాకమారి నుంచి కశ్మీర్ వరకు మోటర్ సైకిల్  యాత్ర

By

Published : Jun 15, 2019, 9:17 PM IST

కన్యాకమారి నుంచి కశ్మీర్ వరకు మోటర్ సైకిల్ యాత్ర

ప్రజలు ఎదుర్కొంటున్న నీటిఇక్కట్లు తొలగాలంటూ కన్యాకుమారి నుంచి జమ్ము కాశ్మీర్‌ వరకు యాత్రను ప్రారంభించారు తమిళనాడుకు చెందిన దురై బాలగురు. ప్రస్తుతం ఆయన యాత్ర తమిళనాడు, కేరళ మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకుంది. వాహనం ముందు వెనకాల ఫ్లెక్సీలు.. మహనీయుని చిత్రాలు, మధ్యలో తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో సహజవనరుల పరిరక్షణ కోసం మోటారు వాహన యాత్ర చేపడుతున్నట్లు నినాదాలతో ముందుకు సాగుతున్నాడు.

మార్గమధ్యలోని ప్రతీ పోలీస్టేషన్‌లో తన యాత్ర గురించి తెలుపుతూ...ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రి సమయంలో సమీప దేవాలయం, మందిరాలలో నిద్రించి ఉదయాన్నే యాత్ర సాగిస్తున్నారు. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర అమరనాథ్‌లోని శివుని దర్శనంతో ముగుస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details