గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్ సొసైటీల్లో కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కోలాహలంగా జరిగింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్గా సీతారామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. రాజకీయరంగంలో ఆయన చేసిన కృషిని పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు. సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్పర్సన్గా క్రిస్టియాన బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి తనకు చక్కని అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మార్కెటింగ్ సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె చెప్పారు.
బాధ్యతలు స్వీకరించిన సహకార బ్యాంకు నూతన కార్యవర్గం - latest news for guntur centeral co-operative bank
గుంటూరు జిల్లా సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్ సొసైటీల్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సహకార బ్యాంకు, మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.
సహకార బ్యాంకు, సొసైటీలో కొత్త కార్యవర్గం బాధ్యతలు