గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వివాదంలో ఉన్న భూమిని ఆర్మీలో పని చేసిన వ్యక్తికి ఇవ్వలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు చెప్పారు. భూమి వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పెట్టడంపై షేక్ జిలానీ అనే రైతు మండిపడ్డారు. భూమి తమదేనని.. ఇలా చేయడం అన్యాయమని ఆవేదన చెందుతూ పురుగు మందు డబ్బాతో నిరసనకు దిగారు. ఈ విషయమై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. 1978లో గుళ్లపల్లి హిదాయత్, గఫార్ను నిరుపేదలుగా పరిగణించి కేవలం సాగు నిమిత్తం ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్ఎస్ఆర్ లోనూ వారి పేర్లు నమోదు చేసిన్నట్లు చెప్పారు. ఆర్మీలో పని చేసిన వారికి ఆ భూమి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అధికారుల తీరుపై పురుగు మందు డబ్బాతో రైతు ధర్నా - కాకుమాను భూ వివాదంపై తహసీల్దార్ స్పందన
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం..తమ పొలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో రైతు కుటుంబం..... పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగింది. అసలు ఆ భూమి వారిది కాదంటూ తహసీల్దార్ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.
![అధికారుల తీరుపై పురుగు మందు డబ్బాతో రైతు ధర్నా Tahasildar respond on kommuru farmers land issue in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6204986-995-6204986-1582697206416.jpg)
ఆ భూమి ఆర్మీ వారికి ఇవ్వలేదు.. వీరిదీ కాదు