గుంటూరు జిల్లా తాడికొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేధాలు భగ్గుమన్నాయి. తాడికొండ వైకాపా గ్రామ అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలిసేందుకు ఆమె కార్యాలయానికి వెళ్తే అందరిముందు తనను చులకన చేసి మాట్లాడారని మొహిద్దీన్ ఆరోపించారు. దీంతో మనస్తాపం చెంది పార్టీ గ్రామ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
తాడికొండ వైకాపాలో విబేధాలు.. గ్రామ అధ్యక్షుడు పదవికి రాజీనామా - తాడికొండ వైకాపా గ్రామ అధ్యక్షుడి రాజీనామా
గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా గ్రామ అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనను చులకన చేసి మాట్లాడారని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
షేక్ మొహిద్దీన్