నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. మేడికండూరు మండలం మందపాడు గ్రామంలో 49 మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు అందజేయడంతో పాటు ఇంటి నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం.. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి అలుపెరగక పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముప్పై లక్షలకు పైగా సొంత గృహాలు నిర్మించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం స్థిర పడుతుందని.. తద్వార గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీలో ఉండవల్లి శ్రీదేవి - ఇళ్ల పట్టాల పంపిణీలో ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఆరో రోజు సందడిగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. మేడికొండూరు మండలం మందపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. పేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని.. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలంతో పాటు పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని శ్రీదేవి అన్నారు.
మహిళల పేరునే అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీకే రుణాలందించారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మహిళల కోసం డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇలా ఎన్నో పథకాలు వారి అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. 18 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం జగనన్న మరో ముప్పై ఏళ్ల పాటు సీఎం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని, మనమంతా ఆయనకు అండగా నిలుద్దామన్నారు.
ఇదీ డదవండి:అసలు దోషులపై 15 రోజుల్లో కేసులు నమోదు చేయాలి: లోకేశ్