గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వరద ప్రాంతాల్లో తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి శనివారం పర్యటించారు. పెదపరిమి, తాళ్లాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, పెదలంకలో పరిస్థితిని ఆమె పరిశీలించారు. తాళ్లాయపాలెం లంకలో ఉన్న మత్స్యకారులను పరామర్శించేందుకు నాటు పడవలో వెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టం అంచనాలు వీలైనంత త్వరగా రూపొందించి పరిహారం అందిస్తామన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటన - floods in guntur district news
వరద బాధితులను ఆదుకుంటామని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హామీ ఇచ్చారు. శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
tadikonda-mla-undavalli-sridevi