గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం పేరేచర్లలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పచ్చ తోరణం వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటారు. పచ్చదనం పెంచెేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా లక్షల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. విద్య, వైద్య రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వెల్లడించారు. అమ్మ ఒడి ఇస్తున్న ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుందని అన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని శ్రీ దేవి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
'పచ్చదనం పెంచెేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది' - మెడికొండ్ర వార్తలు
చెట్లు మానవాళి మనుగడకు దోహద పడతాయని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

పచ్చదనం పెంచెేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని