ఆమరావతి కోసం ఆగని పోరు... తగ్గని జోరు - AMARAVATHI PROTEST LATEST
అమరావతినే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా తాడికొండ రైతులు ర్యాలీ నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డులోని దీక్షా శిబిరం నుంచి అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టారు. 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగని ఆమరావతి నినాదాలు..తాడికొండలో రైతుల ర్యాలీలు