ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

global day of parents: ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నాడే.. రోడ్డుపై ఊతకర్రతో పెద్దాయన! - తాడేపల్లిలో వృద్ధుడి కథ

తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. నిర్లక్ష్యంగా రోడ్డు మీదే వదిలేస్తున్నారు. కనిపెంచిన మమకారం కూడా లేకుండా.. నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ తల్లిదండ్రుల(global day of parents) రోజునే.. ఇటువంటి అమానవీయ ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఊత కర్ర ఆధారంగా నడిచే.. సీనియర్ సిటిజన్​ని ఆయన కుటుంబ సభ్యులే ఆటోలో తీసుకొచ్చి.. నడిరోడ్డుపై వదిలేశారు. కర్ఫ్యూ సమయంలో ఎటు వెళ్లాలో తెలియక.. దిక్కులు చూస్తున్న ఆ పెద్దాయనకు పోలీసులు చేయూతనందించారు. అయితే ఇదే విషయం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తే.. పెద్దాయనే కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.. అసలు జరిగిందేంటో చూద్దాం..

father on road
father on road

By

Published : Jun 1, 2021, 11:25 AM IST

Updated : Jun 1, 2021, 12:26 PM IST

.

ఒంటరిగా ఉన్న వృద్ధుడిని కుటుంబసభ్యులకు అప్పగించి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. జాతీయరహదారిపై ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధుడిని పోలీసులు స్టేషన్​కు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి తాడేపల్లిలో వదిలివెళ్లిపోయాడని పోలీసులకు చెప్పారు. తన పేరు సాంబశివరావు అని... కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉంటానని ఎస్సై బాలకృష్ణకు ఆ పెద్దాయన వివరాలు వెల్లడించారు.

.

పోలీసులు జగ్గయ్యపేటలోని సాంబశివరావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సాంబశివరావును ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టారని గట్టిగా ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని వారు పోలీసులకు చెప్పారు. కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం సాంబశివరావును అప్పగించారు.

Last Updated : Jun 1, 2021, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details