ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 6:53 PM IST

ETV Bharat / state

'టార్గెట్ పెరిగింది.. ఇబ్బందిగా ఉంటోంది'

గుంటూరులో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన నిర్వహించారు. పాత పే అవుట్​ పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

swiggy food delivery boys agitation
స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన

స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన

గుంటూరులో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన బాట పట్టారు. తమకు ఇచ్చే పే అవుట్​లు తగ్గించి.. టార్గెట్లు ఎక్కువ చేస్తున్నారని వాపోయారు. మదర్ థెరిసా కూడలి నుంచి స్విగ్గీ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గతంలో వారానికి 2,500 రూపాయల టార్గెట్​ పూర్తి చేయటమే కష్ట తరంగా ఉంటే, ఇప్పుడు 3,500 రూపాయల టార్గెట్ పెట్టి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా యాజమాన్యం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details