రేపటినుంచి రెండు రోజులపాటు గుంటూరులో స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు, సేంద్రియ వ్యవసాయంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. మంచ్ వ్యవస్థాపకులు దత్తోపంత్ శత జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో జరిగే ఈ సమావేశాలకు యువత పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. యువ రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించటానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
రేపటినుంచి స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు - స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు న్యూస్
గుంటూరులో రేపటినుంచి రెండు రోజులపాటు స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు, సేంద్రియ వ్యవసాయంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు.

స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు