SVV School 75th Anniversary Celebration at Tadikonda: రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల 75 ఏళ్ల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరైన గోగినేని కనకయ్య విగ్రహాన్ని, పాఠశాల ప్రస్థానాన్ని తెలిపే సావరిన్ను ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్ధులు ఇచ్చిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.
Justice Lavu Nageswara in SVV School 75th Anniversary Celebration: అనంతరం విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగం సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. అలాంటి సమానత్వాన్ని అందరూ ఆచరణలో పెట్టినప్పుడే సామాజికంగా ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. సంపాదనతో సంతోషం రాదని ఉన్న దానితో సంతృప్తి చెందినప్పుడే సంతోషం వస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు వద్దు..
ప్రభుత్వ పాఠశాలలంటే ఎవరికి చిన్న చూపు వద్దని... తామంతా ప్రభుత్వ బడుల్లో చదివే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అహం, ఈర్ష్య, ద్వేషాలను పక్కనబెట్టినప్పుడే జీవితంలో పైకి ఎదగగలుగుతారని స్పష్టం చేశారు.