ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - guntur latest news

గుంటూరులోని కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ చెరువు వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

suspicious women death in koritipadu guntur district
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : Sep 29, 2020, 3:35 PM IST

గుంటూరులోని కొరిటిపాడులో విజయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. వాకింగ్ ట్రాక్ చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలు.. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అరండల్ పేట సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details