ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లైంగిక ఆరోపణలతో నగరంపాలెం సీఐపై సస్పెన్షన్ వేటు - లైంగిక ఆరోపణలతో సీఐ సస్పెన్షన్

లైంగిక వేధింపుల ఆరోపణలతో గుంటూరు నగరంపాలెం సీఐ వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ వివాహితను లైంగికంగా వేధించారని అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

లైంగిక ఆరోపణలతో సీఐ పై సస్పెన్షన్ వేటు
లైంగిక ఆరోపణలతో సీఐ పై సస్పెన్షన్ వేటు

By

Published : Feb 18, 2020, 5:50 PM IST

గుంటూరు నగరంపాలెం సీఐ వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. భర్త నుంచి వేరుగా ఉంటున్న ఓ మహిళను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సీఐ వెంకటరెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ దక్షిణ కోస్తా ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తనను సీఐ వెంకటరెడ్డి వంచించారంటూ ఇటీవల బాధిత మహిళ గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఐజీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణకు లోబడి విధులు నిర్వహించాలని తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details