ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ తుపాన్ ప్రభావంతో నిర్మానుష్యంగా సూర్యలంక - guntur latest news

నిత్యం రద్దీగా ఉండే సూర్యలంక తీరం.. నివర్ తుపాన్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. కార్తిక మాసం సందర్భంగా సముద్ర స్నానానికి భక్తులు, పర్యాటకులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. తుపాన్ కారణంగా పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు.

సముద్ర తీరం వద్ద పోలీసులు
సముద్ర తీరం వద్ద పోలీసులు

By

Published : Nov 25, 2020, 5:53 PM IST

నివర్ తుపాన్ దృష్ట్యా గుంటూరు జిల్లా.. సూర్యలంకలో అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ జిల్లాల నుంచి సూర్య లంకకు వచ్చే పర్యాటకులను పోలీసులు అనుమతించడం లేదు. దీంతో వారు నిరాశగా తిరిగి వెళ్తున్నారు. తెల్లవారు జామునుంచే గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. తుపాన్ కారణంగా చేపల వేటపై నిషేధం విధించారు. పడవలు నీటిలో కొట్టుకుపోకుండా మత్స్యకారులు ఒడ్డుకు చేరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details