కరోనా ప్రభావం సూర్యలంక తీరాన్ని తాకింది. నిత్యం పర్యాటకులతో రద్దీగా సూర్యలంక హరిత రిసార్ట్స్ కరోనా కారణంగా నిర్మానుష్యంగా మారింది. వారాంతంలో రద్దీగా ఉండే వసతి సముదాయాలు ఇప్పడు ఒక్క పర్యాటకుడు లేక వెలవెలబోతోంది. ఎండీ ఆదేశాలతో విదేశీయులకు వసతి కల్పించడం లేదని, కరోనా లక్షణాలు ఉండి జలుబు, జ్వరంతో బాధపడే వారికీ కాటేజీలు అద్దెకు ఇవ్వడం లేదని రిసార్ట్స్ మేనేజర్ సాయిబాబు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: వెలవెలబోయిన సూర్యలంక బీచ్
నిత్యం పర్యాటకులతో సందడిగా కనిపించే సూర్యలంక హరిత రిసార్ట్స్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇదివరకు హౌస్ఫుల్ అయిన హరిత రిసార్ట్స్... ఇప్పడు పూర్తి ఖాళీగా ఉంది. ఇందుకు కారణం కరోనా అని అధికారులు చెబుతున్నారు.
పర్యాటకులు లేక పేలవంగా ఉన్న సూర్యలంక తీరం