ఆహ్లాదకరం...సూర్యలంక సముద్రతీరం - గుంటూరు జిల్లా వార్తలు
బాపట్ల మండలం సూర్యలంక తీరం పర్యాటకులతో సందడిగా మారింది. కార్తీకమాసం కావటంతో భక్తులు సముద్రతీరంలో సైతిక లింగాలను తయారు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![ఆహ్లాదకరం...సూర్యలంక సముద్రతీరం Suryalanka beach bustle with tourists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9625720-514-9625720-1606038754180.jpg)
గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక తీరం పర్యాటకులతో సందడిగా మారింది. కార్తీకమాసంలో సముద్ర స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ...ఈ తీరానికి వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ఆదివారం కావడంతో పర్యాటకులతో తీరం ఆహ్లాదకరంగా మారింది. భక్తులు సముద్రతీరంలో సైతిక లింగాలను తయారు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి...ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటకులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. పోలీస్ అధికారులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.