గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఎన్పీఆర్ సర్వే పేరు చెప్పి ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ముస్లింలు ధర్నా చేపట్టారు. గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. రాజశేఖర్ అనే యువకుడు ముస్లిం ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాలని కోరాడు. ఇరువురి మధ్య మాటలు పెరిగి దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. సర్వే కోసం వచ్చిన యువకులు తమపై దాడి చేశారంటూ ముస్లింలు ఫిర్యాదు చేశారు. కాగా తనను చెట్టుకు కట్టేసి దాడి చేశారంటూ రాజశేఖర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ముస్లింల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముస్లిం పెద్దలకు సీఐ సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
సర్వే పేరుతో దాడి చేశారని.. ముస్లింల ఆందోళన - గుంటూరులో ఎన్పీఆర్ సర్వే తాజా వార్తలు
ఎన్పీఆర్ సర్వే అంటూ వచ్చిన ముగ్గులు వ్యక్తులు వృద్దుడిపై దాడి చేశారని ఆరోపిస్తూ గుంటూరులో ముస్లింలు ఆందోళనకు దిగారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని రాస్తారోకో నిర్వహించారు.
![సర్వే పేరుతో దాడి చేశారని.. ముస్లింల ఆందోళన attack on Muslim man at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6314398-840-6314398-1583478760299.jpg)
సర్వే పేరుతో దాడి చేశారని ముస్లిం ఆందోళన