భూముల రీ సర్వే పూర్తయితే.. సమస్యలు పరిష్కారం అవుతాయని సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.లక్ష్మీ నారాయణ అన్నారు. ప్రభుత్వం వందేళ్ల తర్వాత రీ సర్వే చేయిస్తోందని, అప్పటి రికార్డులకు ఇప్పటి వాస్తవ పరిస్థితికి తేడాలున్నాయన్నారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రీసర్వే ప్రాజెక్టును సీఎం చేపట్టారన్నారు. ఆధునిక సాంకేతికతో రీసర్వే జరుగుతోందన్నారు. ప్రభుత్వం తమ శాఖను ఉన్నతీకరించాలని లక్ష్మీ నారాయణ కోరారు. దీనివలన ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్నారు.
'భూముల రీ సర్వేకు ప్రజలు సహకరించాలి' - భూముల రీ సర్వేపై సర్వే అసోసియేషన్ కామెంట్స్
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేకు ప్రజలు సహకరించాలని సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వం సొంత ఖర్చుతో రీ సర్వే చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
'భూముల రీ సర్వేకు ప్రజలు సహకరించాలి'