తమ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు ఉందన్న వార్తలు అవాస్తవాలని గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ సురేష్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య విబేధాలు, మీడియా సృష్టించిన కథనాలని పేర్కొన్నారు. అవినీతిరహిత పాలన కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన తాము.. ఆయన బాటలో సాగుతామని తెలిపారు. ఇసుక అందరికీ అందాలన్న లక్ష్యంతోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో ఎవరి జోక్యం ఉండదనీ.. ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు.
'మా మధ్య విభేదాలు.. మీడియా సృష్టే..' - media
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ.. అలా వచ్చిన వార్తలు మీడియా సృష్టించిన కథనాలని బాపట్ల ఎంపీ సురేష్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ బాటలో నడుస్తామని తెలిపారు.
'మా మధ్య విభేదాలు మీడియా సృష్టించిన కథనాలు'