అమరావతిలో రాజధాని భూముల వ్యవహారం కేసులో హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని... తదుపరి విచారణలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
అమరావతిలో భూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.... దీనిపై హైకోర్టు గతంలో స్టే విధించింది. దీన్ని ఎత్తివేయాలని కోరుతూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా.... ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. అమరావతిలో పేదలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను బ్రహ్మానందరెడ్డికి బదలాయించడంలో తుళ్లూరు మాజీ తహశీల్దార్ సుధీర్‌బాబు సహకరించారని ఆరోపించారు. అవి అసైన్డ్ భూములు కావటంతో సమీకరణలో ప్రభుత్వం ఉచితంగానే తీసుకుంటుందని...పేదలు, ఎస్సీలకు మాయమాటలు చెప్పి బదలాయించారని పేర్కొన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని.... అనేక పరిశీలనల తర్వాత ప్రభుత్వం పలువురు అధికారులపై కేసులు నమోదు చేసిందని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఐడీ విచారణ ప్రారంభమవగానే సుధీర్‌బాబు, బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని.... అప్పుడు స్టే విధించిందన్నారు. విచారణ ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సమంజసం కాదని రోహత్గీ వాదించారు.
స్టే ఇవ్వడంపై అసంతృప్తి