ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూల్యం చెల్లించాల్సిందే.. - తుళ్లూరులో పర్యటించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ బృందం

తుళ్లూరులో రైతులు, మహిళల మహా ధర్నాను సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం సందర్శించింది. రాజధాని కోసం కొన్ని రోజులుగా సాగుతున్న పోరాటానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ బృందం రైతులకు, మహిళలకు సంఘీభావం తెలిపింది.

Supreme Court lawyers visited the Women’s Mahadarna in thullure
మహిళల మహాధర్నాను సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం

By

Published : Jan 12, 2020, 8:23 AM IST

తుళ్లూరులో రైతులు, మహిళల మహా ధర్నాను సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం సందర్శించింది. రాజధాని కోసం కొన్ని రోజులుగా సాగుతున్న పోరాటం... మహిళలపై జరిగిన దాడిని తెలుసుకున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ బృందం రైతులకు, మహిళలకు సంఘీభావం తెలిపింది. సామాన్య ప్రజల రాజ్యాంగపరమైన హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు కృషి చేస్తామని న్యాయవాదుల బృందం తెలిపింది. రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తమపై జరిగిన దాడిని.. పోలీసులు లాఠీలతో కొట్టారంటూ.. గాయాలను న్యాయవాదులకు చూపించారు.

మహిళల మహాధర్నాను సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details