ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్యాంగమే మనకు రాజు: జస్టిస్ లావు నాగేశ్వరరావు - గుంటూరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు

సమాజంలో ఎప్పుడు సమానత్వం వస్తుందో అప్పుడే స్వాతంత్య్రం వస్తుందని.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. దేశంలో పాలించడానికి మనుషులు ఉన్నప్పటికీ వాళ్లు రాజులు కాదని.. రాజ్యాంగమే మనకు రాజు అని ఆయన అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా.. గుంటూరు జిల్లా పెదనందిపాడులోని రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

supreme court judge lavu nageshwar rao participates in special prayers at guntur
రాజ్యాంగమే మనకు రాజు: జస్టిస్ లావు నాగేశ్వరరావు

By

Published : Dec 25, 2020, 3:55 PM IST

దేశంలో పాలించడానికి మనుషులు ఉన్నప్పటికీ వాళ్లు రాజులు కాదని.. రాజ్యాంగమే మనకు రాజు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా.. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామమైన పెదనందిపాడులో కుటుంబ సభ్యులతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

సమాజంలో ఎప్పుడు సమానత్వం వస్తుందో.. అప్పుడే స్వాతంత్య్రం వస్తుందన్నారు. 70 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం రాలేదని.. ఇప్పుడు కూడా వచ్చిందో లేదో తెలియదన్నారు. పిల్లలను బాగా చదివించాలని.. విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారని అన్నారు. రాజ్యాంగంలో అందరికి సమానమైన హక్కులు ఉన్నాయన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details