Comments of Justice V Ramasubramanian: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలంటూ తెరాస నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
'జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు' - Supreme Court Latest News
Comments of Justice V Ramasubramanian: సుప్రీంకోర్టులో మంగళవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనర్హత వేటు పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే..!!
ముందస్తు ఎన్నికలు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్ అని, మరికొన్ని వివరాల సమర్పణకు 3 వారాల సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్.. ‘‘తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అలాగే ఈ కేసు విచారణకూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలి కావచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. విచారణను జనవరికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి: