సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువులు తేళ్ల సుబ్బారావు, లాహిరి హాస్పిటల్ అధినేత డా. తేళ్ల సత్యంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఇటీవల కరోనా బారినపడిన బంధువులు కొల్లా పున్నారావు, నాగేశ్వరమ్మ దంపతులను పరామర్శించి ధైర్యం చేప్పారు. అనంతరం చిన్ననాటి స్నేహితులను కలిసి ముచ్చటించారు. చిలకలూరిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
చిలకలూరిపేటలో బంధువులను పరామర్శించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు - గుంటూరులో పర్యటించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యటించారు. బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన.. ఇటీవ కరోనా బారిపడ్డ వారిని పరామర్శించారు.
![చిలకలూరిపేటలో బంధువులను పరామర్శించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు Justice Lau Nageswara Rao at Chilakaluripet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12207201-421-12207201-1624262209173.jpg)
జస్టిస్ లావు నాగేశ్వరరావు