హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఎస్ఈసీ నియామకాన్ని సవాల్ చేసిన పిటిషనర్లు, న్యాయవాదులు స్పష్టం చేశారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాన్ని ఎవ్వరూ సమర్థించరని వారు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇకనైనా మొండిగా వెళ్లకుండా నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించారు.
'రాజ్యాంగ ఉల్లంఘనను సుప్రీం సమర్థించదు'
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బే తగులుతుందని అభిప్రాయపడ్డారు.
Supreme court does not support ap government decision on sec issue, says lawyers