అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఈనెల నుంచి పౌరసరఫరాల శాఖ.. ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను ప్రారంభించింది. గుంటూరు జిల్లాలోని 4,405 అంగన్వాడీ కేంద్రాలు, 3,373 పాఠశాలలకు ఈ సదుపాయాన్ని కల్పిస్తూ జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ దినేశ్‌కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ-12 విటమిన్లు ఉండే బలవర్థక బియ్యం తినడం వల్ల పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టేందుకు, శిశువికాసానికి దోహదపడుతుందని జేసీ దినేశ్ కుమార్ తెలిపారు.
అంగన్వాడీలు, పాఠశాలలకు ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా
ఈనెల నుంచి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. గుంటూరు జిల్లా జేసీ దినేశ్‌కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు.
జేసీ దినేశ్ కుమార్