ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నటుడిగా ఎదిగినా.. పుట్టిన గడ్డను మరవని 'బుర్రిపాలెం బుల్లోడు' - సూపర్​ స్టార్​ కృష్ణ సొంత గ్రామం

Super Star Krishna: ఘట్టమనేని శివరామకృష్ణ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన కృష్ణ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​ల ఆదర్శంతో చిత్రసీమలో అడుగుపెట్టి వెండితెరపై చెరగని ముద్ర వేశారు. ఉన్నత స్థాయికి ఎదిగినా.. పుట్టిన గడ్డపై మమకారం మరువలేదు. సూపర్ స్టార్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. 'బుర్రిపాలెం బుల్లోడు' కృషి ఎనలేనిదంటూ గ్రామస్థులు అంటున్నారు.

Super Star Krishna Own Village
సూపర్​ స్టార్​ కృష్ణ సొంత గ్రామం

By

Published : Nov 15, 2022, 3:57 PM IST

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరును కృష్ణ మరువలేదు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తన తల్లి పేరిట ఏర్పాటైన పాఠశాల నిర్మాణానికి సహకారం అందించారు. రూ.12 లక్షల వ్యయంతో గీతా మందిరం నిర్మించారు. కృష్ణ స్పూర్తితోనే ఆయన తనయుడు, నటుడు మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. తరచూ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య సేవలందిస్తున్నారు. కృష్ణ మరణంతో బుర్రిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్‌స్టార్ చిత్రపటానికి గ్రామస్థులు నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి కృష్ణ చేసిన సేవలు ఎనలేనివంటున్నారు.

గ్రామాభివృద్ధికి కృష్ణ చేసిన సేవలు ఎనలేనివంటున్న గ్రామస్థులు

"నాకు వరుసకు మేనత్త కుమారుడు. బుర్రిపాలెం వస్తుండేవారు. ఇక్కడ సొంత ఊరిలోనే ఇళ్లు ఉంది. వాళ్ల ఆమ్మ గీతామందిరమనే వైష్ణవ ఆలయాన్ని నిర్మించారు. హైస్కూల్​ భవనానికి స్థలం ఇప్పించారు."-బుర్రిపాలెం గ్రామస్థుడు

"ఈ రోజు ఆయన లేడు అంటే మా గ్రామానికి చాలా బాధగా ఉంది. మా గ్రామానికి సీసీ రోడ్లు వేయించారు. పాఠశాలను నిర్మించారు. కరోనా సమయంలో రెండు సార్లు గ్రామంలో టీకాలు ఇప్పించారు." -బుర్రిపాలెం గ్రామస్థుడు

తెలుగు చిత్రసీమలో స్థిరపడ్డాక ఎంతో మందికి సూపర్‌స్టార్ ఉపాధి చూపించారు. ఊరిపై అభిమానంతో పలు చిత్రాల షూటింగ్‌లను ఇక్కడే చేశారు. చాలా మంది ఆయన సినిమాల్లో నటించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

"మా గ్రామంలో చాలాసార్లు సినిమాలు తీశారు. మా గ్రామ రైతులకు, మాకు కృష్ణ ఎంతో సహాయం చేశారు. అలాంటింది ఆయన ఈ రోజు మా మధ్యలో లేడు అంటే బాధగా ఉంది." -బుర్రిపాలెం వాసి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details