Todays Temperatures : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఈ రోజు 2-3 డిగ్రీల మేర పెరిగాయి. వేసవి కాలం ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉందని.. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో భాగంగా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి :ఈ రోజు ఏపీలో రోజు వారి ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీల మేర పెరిగాయి. ఏలూరు జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లాలో 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లాలో 41 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలో 40.83 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లాలో 40.7 డిగ్రీలు, కైకలూరు 40.7 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లాలో, 40.58 డిగ్రీల సెల్సియస్, ప్రకాశం జిల్లాలో 40.31 డిగ్రీలు, సిద్ధవటం 40.22 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లాలో 39.8 డిగ్రీల సెల్సియస్, సత్యసాయి జిల్లాలో 39.8 డిగ్రీలు, వైస్సార్ కడప జిల్లాలో 39.75 డిగ్రీల సెల్సియస్, పల్నాడు లో 39 డిగ్రీలు, తిరుపతి జిల్లాలో 39 డిగ్రీలు, అనంతపురం జిల్లాలో 39.6 డిగ్రీలసెల్సియస్, కర్నూలు లో 39.4 డిగ్రీలు, గుంటూరు లో 38.9 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లాలో 38.9 డిగ్రీలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 38.8 డిగ్రీలు, అన్నమయ్య జిల్లాలో 38.7 డిగ్రీల సెల్సియస్, పార్వతీపురం మన్యం లో 38.6 డిగ్రీలు, తుని 38.6 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 37.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.