గుంటూరు మిర్చియార్డుకు మే 3వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఛైర్మన్ ఏసురత్నం తెలిపారు. పంటను అమ్ముకోవాలనుకునే రైతులు శీతల గోదాముల్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో పంటను అమ్ముకోవచ్చని సూచించారు. అక్కడ కూడా మార్కెటింగ్ శాఖ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే విక్రయించి మంచి ధర పొందాలని కోరారు. మిర్చియార్డుకు జూన్ 6వరకూ యార్డుకు సెలవులు ఉంటాయయని ఏసురత్నం వెల్లడించారు.
మే 3 నుంచి జూన్ 6వరకు గుంటూరు మిర్చియార్డుకు వేసవి సెలవులు - guntur mirchi yard latest news
గుంటూరు మిర్చియార్డుకు మే మూడో తేదీ నుంచి జూన్ ఆరో తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు మిర్చియార్డు ఛైర్మన్ ఏసురత్నం అన్నారు.
గుంటూరు మిర్చియార్డు