గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో అప్పులు ఎక్కువయ్యయని ఆవేదనకు చెంది కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గెట్టి శ్రీను పొలం కౌలుకు సాగు చేస్తుండేవాడు. పంట నష్టం రావటంతో మూడు లక్షల అప్పు అయింది.దీంతో మనోవేదన పడ్డాడు. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. భర్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అప్పుల బాధ తాళాలేక కౌలు రైతు ఆత్మహత్య - తాడికొండ నియోజకవర్గం
ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడికొండూరులో జరిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరులో చోటుచేసుకుంది.

అప్పుల బాధ తాళాలేక..కౌలు రైతు ఆత్మహత్య