ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపై పడుకున్నాడు.. చివరికి..? - నేర వార్తలు

ఆత్మహత్య చేసుకుందామని రైల్వే ట్రాక్ మీదికెక్కాడు. లోకో పైలెట్ ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

suicide attempt at guntur
suicide attempt at guntur

By

Published : Jul 13, 2021, 5:12 AM IST

Updated : Jul 13, 2021, 6:39 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లోకోపైలట్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది.కానీ, ఆ యువకుడు తన రెండు పాదాలు కోల్పోయాడు.

క్షతగాత్రుడిని తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించారు. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. అదే రైలులో విజయవాడ తరలించారు. రైల్వేస్టేషన్‌ నుంచి 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Last Updated : Jul 13, 2021, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details