గుంటూరు:
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా గుంటూరు జిల్లాలో వరుణుడు కరుణ చూపాడు. ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం చల్లబడింది. గత రెండు వారాలుగా 45, 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడేవారు. ఇలాంటి సమయంలో ఇవాళ కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. అధిక వేడి నుంచి ప్రజలకు కొంత మేర ఊరట లభించింది.
నెల్లూరులోనూ..
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇవాళ సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. రోడ్లపై, మురుగునీటి కాలువల్లో వర్షపు నీరు ప్రవహించింది. ఇటీవల కొద్దిరోజుల నుంచి తీవ్ర ఎండలతో అవస్థలు పడుతున్న ప్రజలు... కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.