మంగళగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని బేకరీ, స్వీట్స్, ఎలక్ట్రికల్, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేశారు. కొలతలు, తయారీ తేదీలు, నాణ్యత లోపంతో సరుకులు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించని పది దుకాణాదారులకు 65వేల రూపాయలు జరిమానా విధించారు. దాడుల్లో సాంకేతిక సహాయకులు శివ శంకర్, సయ్యద్ సలీం పాల్గొన్నారు.
మంగళగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారుల ఆకస్మిక దాడులు - Sudden raids of weights and measures officers news
గుంటూరు జిల్లా మంగళగిరిలో తూనికలు, కొలతల శాఖాధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని దుకాణాదారులకు జరిమానా విధించారు.
దుకాణాల్లో పదార్థాలను పరిశీలిస్తున్న అధికారులు