అమరావతి కోసం మూడు నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న అన్నదాతలు తాజాగా ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం చేపట్టారు. అమరావతి రాజధానిగా ప్రధాని మోదీ భూమిపూజ చేసిన ప్రాంగణంలోనే రాజధాని రైతులు, మహిళలు ఈ యాగం నిర్వహిస్తున్నారు. భాజపా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించి... రాజధాని తరలిపోకుండా కాపాడాలని మహిళలు కోరుతున్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.... రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. రాజధాని ఇక్కడే కొనసాగించి శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయాలని భగవంతుడుని ప్రార్థించారు.
అమరావతి కోసం సుదర్శన యాగం - అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం
అమరావతిని రాజధానిగా కొనసాగించేలా సీఎం జగన్మోహన్రెడ్డి మనసు మార్చాలని కోరుతూ... రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం చేపట్టారు.
![అమరావతి కోసం సుదర్శన యాగం Sudarshana Yagam for amaravathi at Uddandarayunipalem in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6415414-437-6415414-1584256411088.jpg)
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం
అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన యాగం