పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అనడం సరికాదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి పర్యటించారు. తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణలో గాయపడిన వైకాపా కార్యకర్తలను సుచరిత పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘తెదేపా కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం వంద మందిని కూర్చోబెట్టి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ముందుగానే రాళ్లు ఏర్పాటు చేసుకొని దాడికి పాల్పడ్డారు. నిజాలు తెలియజేయడానికే కొప్పర్రు గ్రామాన్ని సందర్శించాను. ఘర్షణలో తెదేపా శ్రేణులు గాయపడ్డారని అంటున్నారు. మీడియాలో ఒక్కరిని కూడా ఎందుకు చూపించలేదు? మీడియా నిజాలు చూపించాలి. భయానక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అత్యంత దారుణం.
minister sucharita : కొప్పర్రులో వైకాపా శ్రేణులకు హోంమంత్రి పరామర్శ
రాష్ట్ర హోమంత్రి సుచరిత కొప్పర్రులో వైకాపా శ్రేణులను పరామర్శించారు. వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే తాను కొప్పర్రులో పర్యటిస్తున్నాని ఆమె చెప్పారు.
sucharita kopparru visit