ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం - latest news in subsidize onion in guntur

రాయితీపై ఉల్లి విక్రయాలను మంత్రులు మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గుంటూరులో ప్రారంభించారు. ఒక్కొక్కరికి కేజీ రూ.25కే ఇస్తున్నారు.

రాయితీ ఉల్లి విక్రయాలు ప్రారంభం

By

Published : Nov 23, 2019, 3:59 PM IST

రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం

రాయితీపై ఉల్లి విక్రయాలను రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గుంటూరులో ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కేజీకి రూ.70 నుంచి 90 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశం మేరకు... రాయితీ విక్రయాలను ప్రారంభించారు. ఒక్కొక్కరికి కేజీ రూ.25కే ఇస్తున్నారు.

ప్రతిరోజు 1500 క్వింటాళ్ల ఉల్లిపాయలు తెప్పిస్తామని... నెలరోజుల వరకు ఈ అమ్మకాలు జరుగుతాయని.. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్రంలోని 85 రైతుబజార్లలో నెల రోజుల పాటు 45వేల క్వింటాళ్ల ఉల్లి విక్రయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details